Healthhealth tips in telugu

30 సంవత్సరాలుగా తగ్గని డయాబెటిస్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన ఆకు

Podapatri Benefits In telugu : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడవలసిందే. అలా మందులు వేసుకుంటూ కొన్ని చిట్కాలను పాటిస్తే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. పొడపత్రి ఆకు డయాబెటిస్ నిర్వహణలో సహాయపడుతుంది. ఈ ఆకును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. పొడపత్రి ఒక రకమైన ఔషధ మొక్క. ఇందులో యాంటీ డ‌యాబెటిస్ ల‌క్ష‌ణాలు ఉంటాయి.
Diabetes diet in telugu
అందువ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. షుగర్ ఉన్న‌వారు పొడ‌ప‌త్రి చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. ఈ ఆకును పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా తాజా ఆకులను నమలవచ్చు.టీ తయారుచేసుకొని తాగవచ్చు.ఈ ఆకులను రోజుకు ఒకటి రెండు నమిలితే.. షుగర్ లేవల్స్ నియంత్రణలోకి వస్తాయి.

ఈ మొక్కల్లో ఉండే చిన్విక్ యాసిడ్.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. కాకపోతే పొడపత్రి ఆకులు చాలా చేదుగా ఉంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే ఉంటుంది. అయితే.. డయాబెటిస్ లేని వారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది. ఉన్నవారికి చప్పగా అనిపిస్తుంది.

డయాబెటిస్ నియంత్రణలో ఉంచటమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. అలాగే శ‌రీరంలో కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిలు త‌గ్గుతాయి. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు తగ్గుతాయి. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. తీపి పదార్ధాలు తినాలనే కోరిక తగ్గుతుంది. పొడపత్రిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణుని సలహా తీసుకోవటం మంచిది.