3 రోజులు పరగడుపున నెయ్యిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Ghee and black pepper : నెయ్యి,మిరియాలు రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి వీటిని వాడుతూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ప్రతిరోజు ఉదయం అర స్పూను నెయ్యిలో రెండు చిటికెల మిరియాలపొడి కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

విపరీతమైన మంచు,చలి కారణంగా చాలా తొందరగా దగ్గు,గొంతునొప్పి వంటివి వచ్చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. నెయ్యిలో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంజియో జెనెసిస్ అనే ప్ర‌క్రియ జ‌రుగుతుంది.

అంటే కొత్త‌గా ర‌క్త నాళాలు తయారు అవుతాయి. దీంతో శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. వాపులు త‌గ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలో వ్యర్ధాలు, విష పదార్ధాలు తొలగిపోవటమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా అవసరం.

మెదడు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండి ఏకాగ్రత,జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. చదువుకొనే పిల్లలకు ప్రతి రోజు పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది. లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది.కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.