డయాబెటిస్ ఉన్నవారు గ్రీన్ టీ తాగితే ఏమి అవుతుందో తెలుసా?

Green Tea Benefits In telugu :డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అంటే పది మందిలో అయిదు నుంచి ఆరుగురికి డయాబెటిస్ వచ్చేస్తోంది.
Green Tea Benefits In telugu
డయాబెటిస్ వచ్చింది అంటే జీవన విధానాన్ని మార్చుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. గ్రీన్ టీ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనలో చాలామంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అధిక బరువు సమస్య ఉన్న వారికి చాలా బాగా సహాయపడుతుంది.

అలాగే మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా సహాయం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజూ గ్రీన్ టీ తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం రోజుకి ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.లిమిట్ గా తీసుకుంటేనే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే గ్రీన్ టీ లో పంచదారను కలపకూడదు. గ్రీన్ టీ బాగా రుచిగా ఉండటానికి కొంచెం నిమ్మరసం లేదా కొన్ని పుదీనా ఆకులను వేసుకోవచ్చు. గ్రీన్ టీ ని కలిపినా తరువాత 2-3 నిముషాల కంటే ఎక్కువ సేపు ఉంచవద్దు. ఆలా ఉంచితే గ్రీన్ టీ చేదు వస్తుంది. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే టీ బాగ్స్ కి బదులుగా బయట దొరికే గ్రీన్ టీ పొడిని ఉపయోగించాలి.