వారంలో 3 సార్లు తాగితే చాలు కొవ్వు, వ్యర్థాలు బయటకు పోయి లివర్ శుభ్రం అవుతుంది

Liver Cleaning Food : శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో ఐదు వందలకు పైగా పనులను చేస్తుంది. అటువంటి .కాలేయన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేయం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే జీర్ణ వ్యవస్థలో కీలక మార్పులు వచ్చి వ్యవస్థ మొత్తం దెబ్బ తింటుంది. .
Pudina Health benefits in telugu
కాలేయంను మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో శుభ్రం చేసుకోవచ్చు. కాలేయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రోటీన్లు సంశ్లేషణ చేస్తుంది. కొవ్వులను., పిండిపదార్థాలను, ప్రొటీన్లను జీర్ణం చేసి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, మనం చేసే కొన్ని పనుల కారణంగా కాలేయంలో వ్యర్ధాలు, విషపదార్థాలు పేరుకుపోతాయి.

ముఖ్యంగా ఎక్కువగా నూనెలో వేగించిన పదార్ధాలు తీసుకోవటం, జంక్ ఫుడ్ తీసుకోవటం, మద్యం ఎక్కువగా సేవించడం, పొగ తాగటం వంటి కారణాల వల్ల కాలేయం మీద ఎక్కువగా భారం పడుతుంది. అది సామర్థ్యానికి మించి పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కాలేయన్ని శుభ్రం చేసుకోవాలి. కాలేయన్ని శుభ్రం చేసుకోవటానికి పుదీనా ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

పది నుంచి పదిహేను పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిలో వేసి పొయ్యి మీద పెట్టి ఎనిమిది నిమిషాల పాటు సిమ్ లో బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి. ఈ విధంగా తాగటం వలన .కాలేయంలో ఉండే విషపదార్థాలు, వ్యర్ధాలు అన్నీ బయటికి పోయి లివర్ శుభ్రంగా ఉంటుంది. ఈ డ్రింక్ ను ప్రతి రోజూ తాగాల్సిన అవసరం లేదు. వారంలో మూడు సార్లు తాగితే సరిపోతుంది.