ఇలా చేస్తే 5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార,పసుపు పోయి తెల్లగా మెరుస్తాయి

White Teeth Tips In telugu : ఈ రోజుల్లో కాఫీ, టీ తాగటం గుట్కా, పాన్ నమలటం ఎక్కువైపోయింది. దాంతో పళ్ళు పసుపు రంగులోకి మారటం, గార పట్టటం వంటివి జరుగు తున్నాయి. ప్రతి రోజూ బ్రష్ చేసిన సరే ఈ పసుపు రంగు అలాగే గార పోదు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తొలగించుకోవచ్చు.
White teeth tips
ఒక బౌల్ లో ఒక పాకెట్ eno పొడి వెయ్యాలి. దానిలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చేతి వేలుతో గాని టూత్ బ్రష్ తో గాని తీసుకుని పళ్ళ పై బాగా రుద్దాలి. ఈ విధంగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడగాలి ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా పళ్ళ పై ఉన్న గార., పసుపు రంగు తొలగిపోయి తెల్లగా మెరుస్తూ ఉంటాయి.

Eno నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. పిప్పి పన్ను సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగి స్తుంది. Eno లో బేకింగ్ సోడా ఉండటం వలన దంతాలు తెల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మలో విటమిన్ సి, బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల పంటి మీద పసుపు రంగు తొలగిపోయి తెల్లగా రావడానికి సహాయపడుతుంది.

కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లని,మెరిసే దంతాలను సొంతం చేసు కోవచ్చు. నిమ్మకాయ, Eno రెండు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మంచి ఫలితం వస్తుంది.