కేవలం 5 రూపాయిల ఖర్చు…రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య జీవితంలో ఉండదు

Thotakura Benefits In telugu : ఈ చలి కాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యమవుతాయి. ఈరోజు తోట కూర తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. చాలామంది తోటకూర గడ్డిలా ఉంటుందనే కారణంతో తినటానికి ఇష్టపడరు. కానీ వాటిలో ఉన్న పోషకాలు చూస్తే తినని వారు కూడా తినడానికి ప్రయత్నం చేస్తారు.

తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలో అవసరమైన ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పాటును అందించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు అలాగే రక్తహీనత సమస్య రాకుండా ఉండాలంటే వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

తోటకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తోట కూర తింటే శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య నుండి బయటపడేస్తుంది. అలాగే మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల .కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోటకూర చాలా బాగా సహాయపడుతుంది అలాగే రక్తాన్ని శుభ్రపరిచి రక్తనాళాల పనితీరు సమర్థ వంతంగా ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తోటకూరలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి.