Healthhealth tips in telugu

మాంసం కంటే బలమైన తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటి అసలు సంగతి తెలిస్తే …

Horse Gram Benefits In Telugu : మాంసం కంటే ఉలవల్లోనే ఎక్కువ పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మాంసం తినని వారికి ఉలవలు మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. ఉలవల్లో ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, ఐరన్ వంటివి సమృద్దిగా ఉండుట వలన నీరసం,నిసత్తువ లేకుండా చురుకుగా ఉంటారు.
Horse Gram benefits
అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఆహారంలో బాగంగా చేసుకుంటే ఆ సమస్య నుండి బయట పడతారు. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగాను ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఒక కప్పు ఉడికించిన ఉలవలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
Weight Loss tips in telugu
శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉలవలు తింటే అస్సలు కొవ్వు చేరదు. అందువల్ల అన్ని వయస్సులవారు తినవచ్చు.
ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అలాంటి వారు తమ ఆహార ప్రణాళికలో ఉలవలను చేర్చుకుంటే చక్కెర స్థాయిని నియంత్రించడంలో, తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
kidney problems
ఉలవ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల ఎదిగే పిల్ల‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వారి శ‌రీర నిర్మాణానికి పనికివస్తాయి.ఉల‌వ‌ల్లో ఆక‌లిని పెంచే గుణాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు కూడా వారంలో మూడు సార్లు తీసుకుంటే మూత్ర పిండాల్లోని రాళ్లను పగలగొట్టి శరీరం నుండి బయటకు పంపటంలో సహాయపడతాయి.
Horse Gram benefits
క‌డుపులో నులి పురుగుల‌ను నివారించ‌డంలో కూడా ఉల‌వ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉల‌వ‌ల క‌షాయాన్ని పాల‌లో క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల నులి పురుగులు న‌శిస్తాయి. ఉలవలను ఒకప్పుడు పెద్దగా వాడేవారు కాదు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి చాలా మంది వాడుతూ ఉన్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.