ఈ పూల మొక్క మీ ఇంటిలో ఉందా…అయితే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి

December Flower Benefits : పల్లెటూర్లలో ప్రతి ఇంటిలోనూ దాదాపుగా ఇప్పుడు చెప్పే పూల మొక్కలు ఉంటాయి. అలాగే ఇంటి ముందు, రోడ్డు పక్కన కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టు పేరు డిసెంబర్ పూల చెట్టు. ఈ పూలను ఎక్కువగా మాల కట్టి జడలో అలంకరించుకోవడానికి, అలాగే దేవుని పూజకు సమర్పించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
december flower
సీజనల్ గా వచ్చే పువ్వులు ఎన్ని ఉన్నా డిసెంబర్ పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారు వర్ణం., తెలుపు, లేత గులాబీ,వంకాయ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు డిసెంబర్ నెల ప్రారంభం నుండి ఫిబ్రవరి నెల వరకు బాగా పుస్తాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులను దగ్గు., న్యూమోనియా చికిత్సలో వాడతారు. ఆకులు., వేర్లు జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఈ మొక్కను రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంగా కూడా వాడుతుంటారు. అలాగే రక్త శుద్ధి కోసం, డయాబెటిస్ నియంత్రణ లోనూ ఉపయోగిస్తారు.

ఈ మొక్క వేరు రసాన్ని అజీర్ణ సమస్యకు ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఈ మొక్క ఆకు రసాన్ని కాలిన గాయాల వాపుకు తగ్గించడానికి వాడతారు. అయితే ఇటువంటి ఆకులను, వేర్లను వాడేముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకుంటే మంచిది. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే మనకు సహాయపడతాయి.