అల్లం+బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Ginger and jaggery Benefits : చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి కూడా వస్తూ ఉంటాయి. అల్లం బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
అల్లం,బెల్లం రెండింటిలోనూ ఎన్నో పోషకాలు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న అల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క కలిపి నమిలి మింగేసి… ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను,బెల్లంను మెత్తని పేస్ట్ గా చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన బెల్లం లో ఉండే జింక్ సెలీనియం శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ సమస్యలు లేకుండా చేస్తాయి. బెల్లం కలిపి తీసుకోవడం వలన మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో వేడిని పెంచుతాయి. అల్లం బెల్లం రెండింటిలో ఉన్న లక్షణాలు… రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తహీనత సమస్య తో బాధపడే వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది.
మోకాళ్ళ నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఉదయం సమయంలో తీసుకోవడం వల్ల నీరసం,అలసట,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. అల్లం, బెల్లం మిశ్రమంలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో శారీరక దృఢత్వం లభిస్తుంది. ఉదయం సమయం తీసుకోవటం కుదరని వారు సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు.