Healthhealth tips in telugu

Acidity Remedies: ఎసిడిటీ సమస్యా… అయితే ఈ సీక్రెట్ రెమెడీ ఫాలో అయిపోండి..!

Acidity home remedies in telugu : ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు చాలా ఎక్కువ తినేస్తుంటారు. దీనివల్ల మరుసటి రోజు ఉదయం.. కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ అజీర్ణాన్ని సూచించే లక్షణాలు. చాలా అసౌకర్యానికి గురిచేస్తాయి. అజీర్ణం సమస్య ఉన్నప్పుడు.. పొట్టలో నొప్పి, అసౌకర్యాన్ని ఫేస్ చేస్తారు.

అజీర్ణానికి రకరకాల కారణాలుంటాయి. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, అధిక బరువు, ఎసిడిటీ, అల్సర్స్ వంటివి అజీర్ణానికి ప్రధాన కారణాలు. కడుపు ఉబ్బరం, పొట్టనొప్పి, గ్యాస్, త్రేన్పులు, వికారం, వాంతులు వంటివి ఉంటాయి. కాబట్టి.. మీరు న్యాచురల్ గా ఈ అజీర్ణం సమస్యలు నివారించుకోవాలి అనుకుంటే.. ఎఫెక్టివ్ హోం రెమెడీని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం 2 టీస్పూన్లు
అల్లం రసం 2 టీస్పూన్లు

తయారు చేసే విధానం
పైన వివరించిన పదార్థాలన్నింటినీ ఒక కప్పులో కలపాలి. కొద్దిగా నీటిని అందులో కలపాలి. అన్నింటినీ.. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని.. రోజుకి రెండుసార్లు.. భోజనం తర్వాత తీసుకుంటే.. అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైతే.. మీరు అజీర్ణం సమస్యతో బాధపడతారో అప్పుడు ఈ డ్రింక్ తాగితే.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

ఈ డ్రింక్ తాగుతూ.. స్పైసీ, ఆయిలీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ ని డైట్ లో చేర్చుకోవాలి. ఈ రెమెడీలో ఉపయోగించిన మూడు పదార్థాల్లోనూ ఎసిడిటీ తగ్గించే సత్తా ఉంటుంది. పొట్టలో ఎసిడిటీ తగ్గితే.. ఎఫెక్టివ్ గా అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.