మన చుట్టూ పరిసరాల్లో ఉండే చెట్టు ఇది.. ఈ చెట్టులో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని మీకు తెలుసా ?

Kanuga Chettu: కానుగ చెట్లు మన ఇంటి చుట్టుపక్కల, రోడ్ల పక్కన కనపడుతూనే ఉంటాయి. ఈ చెట్టు కేవలం నీడకు మాత్రమే ఉపయోగ
పడతాయని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగి స్తున్నారు. ఈ చెట్టు ఆకులు, పూలు, కాండం, బెరడు, కొమ్మలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
KANUGA chettu benefits
కానుగ చెట్టు ఆకులతో తయారుచేసిన కషాయం తాగితే జీర్ణ సంబంద సమస్యలు అయిన గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యలు అయిన దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటివి కూడా తగ్గుతాయి. కానుగ చెట్టుకు కాయలు బాదం కాయలు వలెనే కాస్తాయి. వీటిల్లోని గింజలను తీసి మెత్తగా నూరి దానిలో తేనె కలిపి తీసుకుంటే గాయాలు త్వరగా మానతాయి.
Kanuga Chettu Tips
అలాగే శరీరాంతర్గత రక్తస్రావాన్ని ఆపే శక్తి కానుగకు వుంది. బాగా వేడిగా ఉన్న గంజిలో రెండు ఆకులను వేసి రెండు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ఆకులను తీసేసి ఆ గంజిని తాగితే వాంతులు తగ్గుతాయి. పైల్స్‌ సమస్య ఉన్నవారికి కానుగ చెట్టు బెరడు ఎంతగానో సహాయ పడుతుంది. బెరడును నీటి సాయంతో మెత్తగా నూరి పైల్స్ ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి.
kanuga chettu benefits in telugu
కానుగ చెట్టు పుల్లతో పళ్లు తోముకుంటుంటే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెంది రుచి పెరుగుతుంది. లేత కానుగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసం తాగడం వల్ల విరోచనాలు అవకుండా ఉంటాయి. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
Kanuga Oil benefits
కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా బాగా సహాయపడుతుంది. ఈ నూనెను గజ్జి, తెల్ల మచ్చలు, తామర వంటి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతిపై రాస్తే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.