Beauty Tips

రాత్రికి తలకి రాసుకొని ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రు,దురదలు, జుట్టు రాలటం తగ్గుతుంది

Hair Care Tips : చలికాలంలో జుట్టు రాలిపోవడం.. చుండ్రు సమస్యలు ఎక్కువ అవుతాయి. చుండ్రు సమస్య వచ్చిందంటే దురద కూడా వస్తుంది. ఈ సమస్యను వదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి పోతారు. అలాగే మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.
Tea Tree Oil
మన ఇంటిలో ఉన్న కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు. ఒక బౌల్లోకి 10 ml టీ ట్రీ ఆయిల్ తీసుకోని దానిలో 100 ml కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన ఆయిల్ ని ప్రతిరోజూ సాయంకాల సమయంలో మాడుకి బాగా పట్టించాలి.
రాత్రి అంతా అలా ఉంచుకొని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.

ఈ విధంగా చేయటం వలన చాలా తక్కువ ఖర్చుతో చుండ్రు సమస్య నుంచి బయట పడటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. తల నుండి పొట్టు రాలడం ఆగుతుంది. జుట్టు పోడిదనం తగ్గి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చుండ్రు పోవడానికి కెమికల్స్ తో చేసిన షాంపూలు వాడటం కన్నా నేచురల్ గా టీ ట్రీ ఆయిల్ వాడటం చాలా మంచిది.

టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు తగ్గించటానికి సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.