Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్న‌వారు ఈ డ్రింక్ తాగితే ఏమి అవుతుందో తెలుసా ?

Diabetes : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవల్సిందే. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్నప్పుడూ తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Diabetes In Telugu
మన ఇంటిలో తయారుచేసుకొనే హెర్బల్ డ్రింక్స్ చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్స్ లో ఏదో ఒకదాన్ని ప్రతి రోజు తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడతాయి. ఎనిమిది తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

వేప ఆకులు కూడా డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడతాయి. నాలుగు తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అలాగే కరివేపాకు కూడా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. అరస్పూన్ మెంతులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగేయాలి.

అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను సన్నగా కోసి మిక్సీ పట్టి ఆ రసాన్ని పిండుకోవాలి. ఈ రసంలో ఒక గ్లాసు వేడి నీటిని పోసి అందులో కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి కలిపి తాగితే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఇప్పుడు చెప్పిన చిట్కాలలో మీకు వీలును బట్టి ఒక చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్ చూసుకుంటూ ఉండాలి.