Healthhealth tips in telugu

పొట్లకాయ మరియు కోడిగుడ్డు కలిపి తింటే ఏమౌతుందో అసలు నిజం తెలుసుకోండి

Snake gourd and egg : పొట్లకాయ, గుడ్డు కలిపి వండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా వండితే ప్రమాదమని చాలా మంది అనుకుంటారు. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ తినటానికి ఆసక్తి చూపరు. అయితే ఈ విషయంలో నిజం ఎంత అనే విషయానికి వస్తే…ముందుగా వీటిలో ఉన్న పోషకాల సంగతి చూద్దాం.
Potlakaya
పొట్లకాయలో ఫైబర్, నీరు, విటమిన్స్ సమృద్దిగా ఉండుట వలన పొట్లకాయ తింటే శరీరంలో విష పదార్ధాలు అన్ని బయటకు పోతాయి. అలాగే అవయవాల పనితీరు మెరుగుదలకు సహాయపడతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలును చేస్తుంది.

తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను ఇచ్చే గుడ్డు విషయానికి వస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె సమస్యల రిస్క్ తగ్గిస్తుంది. ఒక గుడ్డులో 100 మిల్లీ గ్రాముల కొలైన్ ఉంటుంది. ఇది ఒక అరుదైన పోషకం. మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లయిన లూటిన్, జియాక్సాంతిన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి.
potlakaya,egg
పొట్లకాయ,గుడ్డు కలిపి వండుకొని తినవచ్చు. కానీ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ కాంబినేషన్ కి దూరంగా ఉంటేనే మంచిది. పొట్లకాయ, గుడ్డు కలిపి వండినప్పుడు ఆ రెండూ ఒకే సమయంలో జీర్ణమయ్యేవి అయితే ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. అయితే పొట్లకాయలో నీటి శాతం అధికం ఇది త్వరగా అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో ప్రోటీన్స్, కొవ్వుఆమ్లాలు అధికంగా ఉంటాయి.
Acidity home remedies
అందుకే ఇది అరగడానికి కాస్త సమయం పడుతుంది. ఈ రెండు కలిపి వండినప్పుడు జీర్ణమయ్యే సమయంలో తేడాలు వస్తాయి. అందువల్ల కొందరిలో స్వల్పకాలం పాటూ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది అందరిలోనూ రావాలని లేదు. ఇంతకుమించి ఈ కూరతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.