Healthhealth tips in telugu

అతి చవకగా దొరికే ఈ ఆకుకూర కంటి చూపుకు,కీళ్లనొప్పులకు దివ్య ఔషధం

ponnaganti kura Benefits In Telugu : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పొన్నగంటి ఆకులతో పప్పు, కూర చేసుకుంటూ ఉంటాం. ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా వాడతారు. పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటిచూపు మెరుగుదలకు సహాయ. పడుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
ponnaganti kura
ఎక్కువసేపు కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల కళ్లను రక్షించుకోవచ్చు. కంటి చూపు రెట్టింపవుతుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. వారు కూడా వారంలో రెండు సార్లు ఈ కూరను తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. సంవత్సరం పొడవునా ఈ ఆకుకూర విరివిగానే లభ్యం అవుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.
asthama
ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ కూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణ సంబంద సమస్యలు తగ్గుతాయి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉండే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.