Healthhealth tips in telugu

రోజుకి 3 తింటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి డయాబెటిస్,గుండె సమస్యలు లేకుండా చేస్తుంది

Pine Nuts benefits :మనకు ప్రస్తుతం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఆన్లైన్ స్టోర్స్ లో, డ్రై ఫ్రూట్స్ షాప్ లోనే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. ఈ రోజు పైన్ నట్ గురించి తెలుసుకుందాం.
pine nuts
పైన్ నట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి చాలా బాగా సహాయపడుతాయి. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచి మరియు కాలేయానికి యాంటీఆక్సిడెంట్ నష్టాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గిస్తుంది.

పైన్ నట్స్ లో ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ ఇ, అర్జినిన్, పొటాషియం మరియు పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన గుండె సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో ఎలాజిక్ ఆమ్లం సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు కొలిసిస్టోకైనిన్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తాయి. ఇదిఆకలిని తగ్గించే ఎంజైమ్.

పైన్ నట్స్ లో మాంగనీస్, పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని సమర్థవంతంగా పెంచడానికి సహాయపడుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడం ద్వారా రోగనిరోధక పనితీరును మెరుగుపరచడానికి సహాయ పడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.