జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని రోజుల‌కు ఒక‌సారి త‌ల‌స్నానం చేయాలో తెలుసా?

Hair Bath : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం, బ‌ల‌హీనంగా మార‌డం..వంటి ఎన్నో రకాల జుట్టుకి సంబందించి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు రావటానికి కాలుష్యం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, వంశ‌పారంప‌ర్యత‌ వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

అయితే మనలో చాలా మందికి వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉంటాయి. చాలా మంది ఎక్కువగా తలస్నానం చేస్తే జుట్టు బాగా రాలిపోతుందని భావిస్తారు. ఇది కేవలం అపోహే అని నిపుణులు చెప్పుతున్నారు. తల స్నానం విషయానికి వస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా తలస్నానం చేయాలని నిపుణులు అంటున్నారు.

స్త్రీల విషయానికి వస్తే వారంలో 3 నుంచి 4 సార్లు తలస్నానం చేయవచ్చని, అదే పురుషులు అయితే వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తే జుట్టుకి మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఇలా తలస్నానం చేయటం వలన జుట్టు రాలిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చుండ్రు వంటి సమస్యలు ఉంటే మాత్రం ఏదైనా ప్యాక్ వేసుకొని తలస్నానం చేయాలి.

ఎండలు ప్రారంభం అవుతున్నాయి. చెమట కూడా తలలో పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా జుట్టు మీద శ్రద్ద పెట్టాలి. చుండ్రు వంటి సమస్యలకు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.