Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు వెల్లుల్లి తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Garlic Health Benefits : వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి డయాబెటిస్ నియంత్రణలో ఉంచటానికి సహాయ పడుతుంది. డయాబెటిస్ నిర్వహణలో వెల్లుల్లి కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
garlic
వెల్లుల్లిని ప్రతి రోజు తీసుకోవటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో లభించే రసాయన సమ్మేళనాలు కాలేయానికి తగినంత మొత్తంలో గ్లైకోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో ఇన్సులిన్ విచ్ఛిన్నం అవుతుంది. తత్ఫలితంగా, శరీరంలో ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది, ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా ముఖ్యమైనది.
Diabetes In Telugu
వెల్లుల్లి రెబ్బలను ప్రతి రోజు రెండు తినాలి. పచ్చిగా తినవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చిగా తినకూడదు. అలాగే వెల్లుల్లిని క్రష్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. లేదా రాత్రి సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ నీటిలో వేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి.
Garlic side effects in telugu
ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉండటం వలన శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు హార్ట్ బ్లాక్ వంటి సమస్యలు కూడా ఉండవు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్త ప్రసరణ బాగా సాగి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించటంలో వెల్లుల్లి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు వెల్లుల్లి తింటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వెల్లుల్లిని తినటానికి ప్రయత్నం చేయండి. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.