పైనాపిల్ తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయా…దీనిలో నిజం ఎంత…?
Pineapple : తియ్యగా, పుల్లని రుచిలో ఉండే పైనాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పైనాపిల్ పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. పైనాపిల్ లో అనేక రకాల విటమిన్స్, సిట్రిక్ ఆసిడ్, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటివల్ల మన శరీరానికి శక్తి,పోషణ రెండూ కలుగుతాయి. .
అయితే మనలో చాలామందికి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు పైనాపిల్ తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఫైనాఫిల్ లో బ్రొమెలెయిన్ అనే శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్ ఉండుట వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిస్తుంది.
కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఎటువంటి ఆలోచన లేకుండా ఫైనాఫిల్ ని తినవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది . ఫైనాఫిల్ ని ముక్కలు రూపంలో లేదా జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్న మంచి ఫలితం కనపడుతుంది. ఈ ముక్కలలో తేనె కలిపి తింటే అలసట,నీరసం, నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు.
శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వటానికి ఫైనాఫిల్ లో ఉండే ఎంజైమ్స్ సహాయ పడతాయి. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.