Healthhealth tips in telugu

Throat Infection:పిప్పి తీసి రసం తాగితే దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్, కఫం,శ్లేష్మం అసలు ఉండవు

Throat Infection Home Remedies : జలుబు,దగ్గు, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి వచ్చాయంటే ఒక పట్టానా తగ్గవు. ఇవి ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ని ఉపయోగిస్తున్నాం. ఇవి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.

దీని కోసం అల్లంను శుభ్రంగా కడిగి తురుముకొని రసం తీసుకోవాలి. ఒక కప్పులో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. రోజులో ఒకసారి తాగితే సరిపోతుంది. ఈ రసం తాగటం వలన గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి అన్నీ తగ్గిపోతాయి.

మూడు రోజులు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అల్లం, నిమ్మ రసం, తేనెలో ఉండే లక్షణాలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఈ మిశ్రమం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొలగించ‌డంలో మెరుగ్గా ప‌నిచేస్తుంది.

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. అలాగే కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి గొంతు గరగర, దగ్గును తగ్గించటంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.