Healthhealth tips in telugu

అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన గింజలు…అసలు మిస్ కాకండి

How to eat flax seeds in telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు సమస్య అనేది వస్తోంది. ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం, సరిగా నిద్ర లేకపోవడం, మారిన జీవన శైలి వంటి కారణాలతో అధిక రక్తపోటు సమస్య వస్తోంది.

అధిక రక్తపోటు సమస్య వచ్చిందంటే కచ్చితంగా మందులు వాడాల్సిందే. మందులు వాడకపోతే నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా సహాయపడుతాయి. వాటిల్లో అవిసె గింజలు ఒకటి. అవిసె గింజలలో విటమిన్ ఇ,ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తాయి. అయితే అవిసె గింజలను డైరెక్టుగా తినలేము. ఒకవేళ తిందామని ప్రయత్నం చేసిన సరిగా జీర్ణం కావు. అవిసె గింజలను పొడిగా తయారు చేసుకుని వాడాలి. ఈ పొడిని కూరల్లో లేత చపాతీ పిండిలో కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే అవిసె గింజలను వేగించి పొడి చేసి పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు.

అవిసె గింజలను ఎలా తీసుకున్నా మంచి ఫలితం కనబడుతుంది. రక్తపోటు సమస్యకు మందులు వాడుతూ ఇలా రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.