గోళ్ళు కొరికే అలవాటు మీలో ఉందా…వెంటనే మానకపోతే ప్రమాదంలో పడినట్టే

Nail Bite In Telugu :కొందరు అదే పనిగా గోళ్ళను కొరుకుతూ ఉంటారు. గోరు మొత్తం అరిగి,వేలు చివరి బాగం ముందుకు వచ్చినా సరే గోరును కొరకటం ఆపరు. ఈ అలవాటు దీర్ఘ కాలం పాటు కొనసాగితే వేలు చుట్టూ ఉండే చర్మం పుండు పడటమే కాకా గోరు పెరగటానికి సహాయపడే కణజాలం దెబ్బతింటుంది.

అంతేకాక ఇన్ ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే గోళ్ళను కోరికే అలవాటు నుండి తప్పించుకోవచ్చు.

1. తరచూ గోళ్ళను కత్తిరిస్తూ ఉండాలి.
2. చేదుగా ఉండే నెయిల్ ఫాలిష్ వేసుకోవాలి. గోళ్ళు ఆకర్షణీయంగా కనపడటానికి మానిక్యూర్ చేయించుకోవాలి. గోళ్ళు అందంగా కనపడితే గోళ్ళను కొరకాలని కోరిక ఉండదు.
3.ఒత్తిడి,ఆందోళన వంటివి కూడా గోళ్ళు కోరకటానికి కారణం అవుతాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా ఉండటానికి యోగా చేయాలి.
4. ఇలాంటి పద్దతుల వలన ఎలాంటి ప్రయోజనం లేకపోతే చేతులకు గ్లవుజ్ లనువేసుకోవాలి. అలాగే వేళ్ళ చివర బ్యాండేజ్ అంటించాలి.
5. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నా సరే గోర్లు కొరకటం మానకపోతే డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.