Healthhealth tips in telugu

Diabetes diet:షుగర్ ఉన్నవారు శనగలు తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Diabetes diet-Chickpeas In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. డయాబెటిస్ ఒకసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.

మారిన జీవన శైలి,ఎక్కువగా కూర్చోడం,వ్యాయామం లేకపోవడం,సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో 30 ఏళ్ళ లోపు డయబెటిస్ వచ్చేస్తుంది.
డయాబెటిస్ వచ్చినప్పుడు మందులు వాడుతూ వాటితో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

డయాబెటిస్ ని కంట్రోల్ చేసే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. వాటిల్లో శనగలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శనగల్లో కొవ్వు తక్కువగానూ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి.

శనగల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన శనగలు తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు శనగలు తీసుకుంటే మంచిది. శనగల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా త‌క్కువ‌గా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరగవు.

అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన నెమ్మదిగా జీర్ణం అయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.