Beauty Tips

ఇలా చేస్తే 2 నిమిషాల్లో ఎంతటి పసుపు రంగు ,గార పట్టిన పళ్ళు అయినా తెల్లగా మెరుస్తాయి

Yellow Teeth Tips : పళ్లను శుభ్రంగా బ్రష్ చేసిన సరే ఒక్కోసారి పసుపు రంగులోకి మారిపోతాయి. పళ్ళు పసుపు రంగులోకి మారితే అది వారి ఆత్మ విశ్వాసం మీద ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్కరూ తెల్లని అందమైన పళ్ళు ఉండాలని కోరుకుంటారు. పసుపు రంగులోకి మారిన, గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
White teeth tips
దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి తెల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి. దానిలో పావు స్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రుద్దాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే పసుపు రంగు, గార పట్టిన పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చిగుళ్ళకు బలాన్ని ఇస్తుంది. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు పళ్ళు తెల్లగా మెరవటానికి సహాయ పడతాయి.

ఈ చిట్కా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. మీరు కూడా ఈ చిట్కా ఫాలో అయ్యి తెల్లని పళ్లను సొంతం చేసుకొండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.