Healthhealth tips in telugu

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కదా.. మరి రోజుకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినాలో తెలుసా?

Dry Fruits Health benefits In Telugu : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ లో ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఇష్టం వచ్చినట్టుగా తినకూడదు. ఎంత పరిమాణంలో తినాలో అంతే పరిమాణంలో తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
walnut benefits in telugu
వాల్ నట్స్
వాల్ నట్స్ పెద్దగా రుచి లేకపోయినా వీటిలో 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె సంబందిత వ్యాధుల నుండి రక్షణ కల్పించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వీటిని 10 గ్రాములు తినవచ్చు. అంటే రోజుకి 5 వాల్ నట్స్ తింటే సరిపోతుంది.

వేరుశనగ
చాలా మండి వేరుశనగను వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని ప్రతి రోజు తింటూ ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. వేరుశనగ 10 గ్రాములు అంటే 12 వేరుశనగ గింజలు తింటే సరిపోతుంది.
Diabetes patients eat almonds In Telugu
బాదం పప్పు
బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ గుండె ఆరోగ్యం,మెదడు ఆరోగ్యానికి,చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. 10 గ్రాములు అంటే 8 బాదం పప్పులను తింటే సరిపోతుంది.
cashew nuts Side effects in telugu
జీడిపప్పు
జీడిపప్పును రెగ్యులర్ గా తీసుకుంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. రోజుకి పది గ్రాములు అంటే 4 జీడిపప్పులు తింటే మంచిది. అంటే వారానికి 28 జీడిపప్పులు తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.