Healthhealth tips in telugu

Millets:ఏ సిరి ధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుందో తెలుసా…ఎలా వాడాలి…?

Health benefits of millets : ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్ల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడుతుంది. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉంటే రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క. ఈ సిరిధాన్యాలలో ఈ నిష్పత్తి 5.5 నుంచి 8.8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడి బియ్యం, గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు..

1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి..

2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, మలబద్ధకం, మంచినిద్ర. .

3. ఊదలు (Barnyard Millet): లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు..

4. సామలు (Little Millet): అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.

5. అండు కొర్రలు (Browntop Millet): జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, .ఊబకాయ నివారణ..

సిరిధాన్యాలను వాడటానికి ముఖ్య సూచనలు:.ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు..సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు..ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు..దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.

ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి. అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.