కొబ్బరి నూనెలో వీటిని కలిపితే జుట్టు ఊహించని విధంగా పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది
Hair Fall Tips : జుట్టు రాలే సమస్య,జుట్టు చివర్లు చిట్లటం, జుట్టు ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలు ఇప్పటి రోజుల్లో సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒక పాన్ లో ఒక స్పూన్ మెంతులు,ఒక స్పూన్ లవంగాలను వేసి బాగా వేగించాలి. బాగా వేగాక 50 ml కొబ్బరి నూనె వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ నూనె చల్లారాక మెంతులు,లవంగాలను అలా ఉండగానే సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
మెంతులు తల మీద రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. లవంగాలు దురద,చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. ఈ నూనెను ప్రతి రోజు రాసినప్పుడు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.