Beauty Tips

వేలకు వేలు ఖర్చు పెట్టిన తగ్గని చుండ్రు ఇలా చేస్తే శాశ్వతంగా తొలగిపోతుంది

Dandruff home remedies In Telugu : తలలో చుండ్రు వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. కొంతమందికి తలలో చుండ్రు అనేది పెచ్చులు పెచ్చులుగా కట్టి విపరీతమైన దురదతో బాధపడుతూ ఉంటారు. అలాగే తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్య చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. చుండ్రు నివారణకు యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడిన తాత్కాలికంగా మాత్రమే ఫలితం ఉంటుంది. .
neem leaves benefits in telugu
అదే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చుండ్రు సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. దీనికోసం వేప ఆకులను తీసుకోవాలి. వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే వేపాకులో ఉన్న లక్షణాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి తలకు బాగా పట్టించాలి. .

ఒక పావు గంట అయ్యాక ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ కోసం గుప్పెడు వేపాకులు తీసుకుని దానిలో పావు కప్పు పెరుగు అర చెక్క నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి.ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంటయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. ఈ విధంగా చేస్తే చాలా తక్కువ ఖర్చుతో శాశ్వతంగా చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.