Healthhealth tips in telugu

ఈ గింజలను ఇలా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు,కిడ్నీ సంబంధిత సమస్యలు,అధిక బరువు అనేవి ఉండవు

kidney stones : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది కిడ్నీ సమస్యలు,కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించు కోవటానికి బార్లీ నీరు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బార్లీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి.

కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడూ విపరీతమైన బాధ ఉంటుంది. రాళ్ళు చిన్నగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. రాళ్ళు పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ బార్లీ నీటిని తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తాగితే కిడ్నీ ఇన్ ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

బార్లీ గింజలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. చాలా చవకగా లభిస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు స్పూన్ల బార్లీ గింజలను రఫ్ గా గ్రైండ్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఈ నీటిని వడకట్టాలి. ఈ నీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి.

ఈ బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అన్నీ కరిగిపోతాయి.అంతేకాక ఈ వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే నీరసం,అలసట వంటివి లేకుండా చురుకుగా ఉంటారు. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.