రక్తహీనతను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆకును ఎప్పుడైనా తిన్నారా…?

Tamarind Leaves : సమ్మర్ వచ్చేసింది. చింత చిగురు బాగా విరివిగా దొరుకుతుంది. చింతచిగురు గురించి తెలియని వారుండరు. కానీ కొంత మందికి చింతచిగురు గురించి తెలియదు. ఆకు రాల్చే కాలంలో అన్ని చెట్ల మాదిరే, చింత చెట్ల ఆకులు కూడా రాలి పోతాయి. ఆ తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి.
chintha chiguru
అంటే చింతచిగురు ఫిబ్రవరి,మార్చి ,ఏప్రిల్,మే నెలల్లో చాలా విరివిగా లభిస్తుంది.  ఈ చిగురులను సేకరించి పచ్చడి,పప్పు,కూరల్లో వాడటం మనకు తెలిసిన విషయమే. చింత చిగురు తోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. చింతచిగురు  రుచికి పుల్లగా వుంటుంది కాబట్టి, చింత చిగురు వేసిన కూరల్లో చింత పండు వేయరు.
cholesterol reduce foods
చింత చిగురులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా  ఉంటుంది. దీంతో, ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉంటాయి.

పుల్లని రుచితో ఉండే చింతచిగురులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చిగురులో ఉండే ఐరన్,విటమిన్స్ ఎన్నో ఆరోగ్య సమస్యాలను తగ్గించటంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చింతచిగురు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.
Immunity foods
ఆ ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుస్కుందాం. మనం రోజూ వాడే చింతపండులో కన్నా చింతచిగురు లోనే ఎక్కువ ఆరోగ్య  ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చిగురు లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.చింతచిగురులో  యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అనేక రోగాల నుండి  బయట పడేస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా చింతచిగురుకు  సాటి ఏదీ లేదు. ఆయుర్వేదంలో  మలేరియా జ్వరానికి చింతచిగురు రసం  తాగమని చెబుతారు. చింత చిగురు లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుండి కాపాడుతుంది. చింత చిగురు దొరికే కాలంలో ఎక్కువగా తెచ్చుకొని ఎండబెట్టి సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.