జామకాయ పవర్ తెలిస్తే జన్మలో వదిలిపెట్టరు

ఒక జామకాయ 10 ఆపిల్ పండ్లతో సమానమని జామకాయ తింటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే అని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. అయితే మనకి ఎక్కువగా దొరికి తక్కువ ధరకి అందుబాటులో ఉండే జామకాయలు అంటే కొంత చిన్నచూపు ఉంది. దాంతో మనం తినటానికి ఆసక్తి పెద్దగా చూపం. జామకాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండుట వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
jamakaya
ఈ సీజన్ లో విరివిగా లభించే జామకాయను ఇష్టంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని కాయల్లో లోపల గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నింటిలో గుజ్జు లేత గులాబీ రంగులో ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జామపండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.
jamakaya
జామకాయలో విటమిన్ సి, విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ సమృద్దిగా ఉంటుంది. జామపండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మంచినీటిలో వేసి మూడు గంటలు అయ్యాక ఆ నీటిని త్రాగితే వేసవి కాలంలో దప్పిక తీరుతుంది.
gas troble home remedies
మారిన జీవనశైలి,ఒత్తిడి,సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వంటి కారణాలతో మలబద్దకం సమస్య వస్తుంది. మలబద్దకం సమస్యను అశ్రద్ధ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మలబద్దకం సమస్యకు జామకాయ మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
White teeth tips
అంటే అరటి పండులో కన్నా 63శాతం ఎక్కువ ఉంటుంది. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని జల్లి,నిమ్మరసం కలుపుకొని తింటే తరుచూ వేధించే మలకబద్ధకం సమస్య నుండి బయట పడవచ్చు. ప్రతి రోజు జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి.

ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం (రక్తం కారడం) ఆగుతుంది. జామకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.మధుమేహం ఉన్నవారు కూడా జామకాయను తినవచ్చు. జామపండులో విటమిన్-సి సమృద్దిగా ఉండుట వలన వైరస్ కారణంగా వచ్చే జలుబు తగ్గిపోతుంది. బరువు తగ్గటానికి జామకాయ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. జామకాయ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది.
Weight Loss Tips in telugu
దాంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. జామలొ కొవ్వు,క్యాలరీలు తక్కువగా ఉంటాయి తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. జామకాయలో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.