Beauty Tips

ఈ పేస్ట్ తో ఇలా చేస్తే చాలు తలలో చుండ్రు,పేలు అనేవి జీవితంలో అసలు ఉండవు

Dandruff and lice problems : తలలో చుండ్రు,పేల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలిపోవటం వంటి సమస్య కూడా ఎక్కువ అవుతుంది. పేలు తలలో ఒక్కసారి పట్టాయంటే వదిలించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు,పేల సమస్య రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తారు.
neem leaves benefits in telugu
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సుల్భంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం గుప్పెడు తులసి ఆకులు,గుప్పెడు వేప ఆకులను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు,పేల సమస్య తొలగిపోతుంది. తులసి,వేపలో ఉన్న గుణాలు ఈ సమస్యలను తగ్గించటానికి సహాయపడటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. తులసి ఆకులు,వేప ఆకులు దొరకని వారు పొడిని కూడా వాడవచ్చు. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.