Healthhealth tips in telugu

ఇలా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,డయాబెటిస్,రక్తపోటు అనేవి జీవితంలో ఉండవు

Joint Pains Home remedies : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు అంటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయాబెటిస్ వంటివి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు,అలాగే సమస్యలు రాకుండా ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు,ఒక స్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాలపాటు మరిగించాలి.
jeelakarra Health Benefits in telugu
ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. మనలో చాలామంది భోజనం చేశాక సొంపు తింటుంటాం సోంపు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలో గాలిని తొలగిస్తుంది ముఖ్యంగా కీళ్ల మధ్య ఉన్న గాలిని తొలగించి కీళ్ల నొప్పులు రాకుండా కెఃస్తుంది. శారీరక నొప్పులు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

జీలకర్ర ఎముకల్లో నొప్పి తగ్గించడానికి, కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గించటానికి సహాయపడుతుంది. శరీరంలో గాలి పెరగడం వల్ల నొప్పులు వస్తాయి. శరీరంలో గాలి పెరగకుండా జీలకర్ర సహాయపడుతుంది శరీరంలోకి గాలి వెళ్ళినప్పుడు కీళ్లకు వెళ్లి నొప్పిని కలిగిస్తుంది. కీళ్ల మధ్య నొప్పి ఎక్కువగా ఉంటే గాలి చేరిందని అర్థం చేసుకోవాలి.

ధనియాలు కూడా నొప్పులను తగ్గించటానికి,డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.