Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Home remedies for piles : ఇటీవల కాలంలో మారిన మన జీవనశైలి అలవాట్ల కారణంగా అలాగే ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన లేకపోవడం, గంటల తరబడి అలా కూర్చోవడం ఇలా అనేక రకాల కారణాలతో ఫైల్స్ సమస్య అనేది వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది.
piles home remedies
ఏ పని మీద శ్రద్ద ఉండదు. ఈ సమస్యకు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ముల్లంగి పైల్స్ సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ముల్లంగిని తెల్ల క్యారెట్ అని పిలుస్తారు. చూడటానికి క్యారెట్ వలె ఉన్నా రంగు,రుచిలో అసలు పోలిక ఉండదు. రుచికి కాస్త వెగటుగా ఉంటుంది.

ప్రతి రోజు ఉదయం 50 Ml ముల్లంగి రసం పరగదుపున తాగితే పైల్స్ సమస్య తగ్గుతుంది. ముల్లంగి రసం తాగటం కష్టంగా ఉంటే కొంచెం తేనె కలిపి తాగవచ్చు. ముల్లంగిలో డైటరీఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడుతుంది. ముల్లంగిలోని రాఫానిన్, గ్లూకోసిలినేట్స్ మరియు విటమిన్ సి అనేవి పైల్స్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో మరియు హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.

ముల్లంగిలో అస్థిర నూనెలు ఉండుట వలన వాపును తగ్గించటంలో సహాయపడతాయి. ముల్లంగిలో ఉండే శోథ నిరోధక లక్షణాల కారణంగా పైల్స్‌ కారణంగా వచ్చే దురద మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.