Healthhealth tips in telugu

వీటిని ఇలా తీసుకుంటే చాలు 15 రోజుల్లో ధైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు

Thyroid Health : సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ధైరాయిడ్ గ్రంధి మెడ కింద బాగంలో ఉండి శరీరంలో జీవక్రియలలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల ధైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ గ్రంధి శరీరంలో ఎన్నో పనులకు సహతం చేస్తుంది. అందువల్ల ఈ గ్రంధి పనితీరు బాగుండాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలను డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
Thyroid Foods
బ్రెజిల్ నట్స్ లో మినరల్స్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ బాగా విడుదల కావడానికి ఇవి బాగా సహాయపడతాయి.
బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అలాగే ఈ నట్స్ లో ఉండే సెలీనియం వపును కూడా తగ్గిస్తుంది.

చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్,సెలీనియం అనేవి సమృద్దిగా ఉండుట వలన థైరాయిడ్ హార్మోన్స్ ను పెంచేందుకు తోడ్పడుతుంది. సాల్మొన్, సార్డైన్, ట్యూనా వంటి సముద్రపు చేపలను ఎక్కువగా తింటూ ఉండండి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలు, యోగార్ట్, చీజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో అయోడిన్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అమైనో యాసిడ్ టైరోసిన్ హైపో థైరాడిజంపై బాగా పోరాడుతాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను ఇవి పెంచుతాయి. రోజుకి ఒక గ్లాస్ పాలను తాగవచ్చు. అలాగే అరకప్పు పెరుగు లేదా అరకప్పు జున్ను తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.