1 స్పూన్ చాలు పిల్లల నుండి పెద్దల వరకు కడుపులో నులిపురుగుల సమస్య శాశ్వతంగా పోతుంది

Remedies For Intestinal Worms Nuli Purugulu : కడుపులో నులిపురుగుల సమస్య అనేది సాదరణంగా చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో అరుదుగా కనిపిస్తుంది. అపరిశుబ్రత వలన కడుపులో నులిపురుగులు ఏర్పడతాయి. నులి పురుగుల సమస్య ఉన్నప్పుడు తరచుగా కడుపు నొప్పి రావటం,ఆకలి లేకపోవటం, నీరసం, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి లక్షణాలు కనపడతాయి.
Home remedy for reduce worms in stomach
కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం చాలా ముఖ్యం. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో చిటికెడు లవంగాల పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పిల్లలు అయితే అరస్పూన్ మోతాదులో,పెద్దవారు అయితే ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. మూడు రోజుల పాటు ఇలా తీసుకుంటే నులిపురుగుల సమస్య తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు పొట్టలో ఉండే నులిపురుగులు, సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

లవంగాలలో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు నులిపురుగులు ప్రేగుల్లో గుడ్లు పెట్టనివ్వకుండా చేస్తుంది. అలాగే నులిపురుగులు,సూక్ష్మజీవులను నాశనం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.