దానిమ్మగింజలు తింటున్నారా….తినే ముందు ఈ నిజాలు తెలుసుకోండి

Pomegranate Health benefits in telugu : దానిమ్మ బెర్రీ కుటుంబానికి మరియు పునికసిస్ కుటుంబానికి చెందినది. దానిమ్మను ఇంగ్లిష్ లో Pomegranate అని పిలుస్తారు. Pomegranate అనేది  ఫ్రెంచ్ పదం “పోమ్మే గార్నేటే” నుండి వచ్చింది. దానిమ్మ 4000 సంవత్సరాల క్రితం ఇరాన్లో పుట్టింది అని నమ్ముతారు. దానిమ్మ పండు దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. 

దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తినవచ్చు  లేదా దానిమ్మ రసం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 గింజల వరకు ఉంటాయి. వీటిల్లో పోషకాలు చాలా సమృద్ధిగా  ఉంటాయి. దానిమ్మ గింజలు  శరీరం లోపల, బయట, ఆరోగ్యానికి చాలా సానుకూలమైన ప్రభావాలను చూపిస్తుంది.
Pomegranate Health benefits in telugu
దానిమ్మ గింజలలో  విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా అందరూ దానిమ్మ గింజలను తింటూ ఉంటారు. కానీ దానిమ్మలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. అందువల్ల ఇప్పుడు దానిమ్మ గింజలలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Joint pains in telugu
దానిమ్మ గింజలు కీళ్లవాతం  మరియు ఆర్థరైటిస్ సమస్యలను నయం చేయటంలో సహాయపడతాయి. దానిమ్మలో ఉండే ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు తరచుగా దానిమ్మ గింజలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్నికూడా మెరుగుపరుస్తాయి.
blood thinning
దానిమ్మ గింజలలో  ఉండే యాంటీ యాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపర్చి, హానికారక ఆక్సీకరణం చెందిన లిపిడ్లను విఛ్చిన్నం చేస్తాయి. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దానిమ్మ గింజలను మధుమేహం ఉన్నవారు కూడా  తినవచ్చు.ఈ గింజలలో ఉండే కొన్నిరకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి.
Diabetes In Telugu
దానిమ్మ గింజలలోని  పిండి పదార్థాలలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట వలన మధుమేహాన్ని నివారించడంలో సహాయ పడతాయి.  దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.ఈ గింజలలో  సూక్ష్మజీవుల వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి.
gas troble home remedies
దానిమ్మ గింజలలో ఉండే బి- కాంప్లెక్స్ విటమిన్లు శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు మరియు కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సహాయపడతాయి . దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యం. దాంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఏమి రాకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.