Healthhealth tips in telugu

ఈ పేస్ట్ తో ఇలా చేస్తే అధిక బరువు,బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Lemon weight Loss Tips : వయస్సుతో సంబందం లేకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కేవలం ఒక ఇంగ్రిడియన్ మాత్రమే ఉపయోగించి అధిక బరువు నుండి ఎలా బయట పడవచ్చో తెలుసుకుందాం. నిమ్మకాయ బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

నిమ్మకాయను తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేయాలి. గింజలను తీసేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ కొంచెం చేదుగా, పుల్లగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పేస్ట్, అరస్పూన్ తేనె కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.

నిమ్మతొక్కలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. అలాగే వీటిలో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ జీవక్రియను మెరుగు పరచి తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.