Beauty Tips

ఈ చిట్కా పాటిస్తే చాలు కేవలం 3 రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అవుతాయి

cracked heels Home Remedies : పాదాల పగుళ్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా పగుళ్ళ మధ్య దుమ్ము,ధూళి పెరుకుపోయి సమస్య ఎక్కువ అవుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
Feet Care Tips
గుప్పెడు వేప ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్ లోకి ఈ పేస్ట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆముదం, అరస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పగుళ్లు ఉన్న చోట గోరువెచ్చని నీళ్ళతో దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు తయారుచేసుకున్న పేస్ట్ రాయాలి.

పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి. వేప ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన పగుల్లో ఉన్న బ్యాక్టీరియా గాని, ఇన్ఫెక్షన్ గాని తగ్గించటానికి సహాయపడుతుంది.

ఇక ఆముదం విషయానికి వస్తే పగుళ్లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ పోగొట్టి పాదాలు మృదువుగా మారటానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటిసెప్టిక్ గుణాలు పగుళ్లలో ఉండే దుమ్ము,ధూళి,దురద వంటి వాటిని తగ్గించటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.