Beauty Tips

ఇలా చేస్తే చాలు తలలో పేలు,చుండ్రు,దురద తొలగిపోయి జీవితంలో అసలు ఉండవు

Dandruff and Head Lice Remove Tips : మనలో చాలా మంది తలలో పేల సమస్య,చుండ్రు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కసారి వచ్చాయంటే తగ్గించుకోవటం అంతా సులువైన పని కాదు. దీని కోసం ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
Tulasi Health benefits in telugu
దీని కోసం ఒక మిక్సీ జార్ లో 10 తులసి ఆకులు, 10 పుదీనా ఆకులు, 5 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,గుప్పెడు వేపాకు, అరచెక్క నిమ్మరసం పిండి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా పట్టించాలి. ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఈ విధంగా చేస్తూ ఉంటే తలలో ఉన్న పేలు, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ మొత్తం తొలగిపోతుంది. తులసిలో ఉన్న లక్షణాలు ఈ సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల జుట్టులో ఉన్న చుండ్రును, దురదను తగ్గిస్తాయి.

వెల్లుల్లిలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి సహాయ పడతాయి. ఇక నిమ్మరసం కూడా దుమ్ము, ధూళి, చుండ్రు, పేలను తొలగించటమే కాకుండా దురద ,ఇన్ఫెక్షన్స్ ను తగ్గించటానికి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.