అల్లం+పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Turmeric And ginger benefits : అల్లం,పసుపు రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు,పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. రెండు అంగుళాల అల్లం ముక్కను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు,నీటిని చేర్చుతూ మిక్సీ చేసి రసం తీసుకోవాలి.
Ginger benefits in telugu
ఈ రసాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. శరీరంలో మలినాలను తొలగించి శరీరం అంతర్గతంగా శుభ్రంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మైగ్రైన్ తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ డ్రింక్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి. పొట్టలో యాసిడ్ లేవల్స్ ని తగ్గించి వికారం వంటివి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సిక్ నెస్ ను కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కండరాల మంటను,నొప్పులను తగ్గిస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని,శ్రద్ద పెడితే మన వంటింటిలో ఉండే వస్తువులతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.