Healthhealth tips in telugu

వీటిని తింటే చాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య అనేది ఉండదు

Anemia Home Remedies : ఈ మధ్య కాలంలో తరచుగా రక్తహీనత సమస్య గురించి వింటూ ఉన్నాం. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో రక్తహీనత సమస్య వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఈ సమస్య వస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్నప్పుడూ తీవ్రమైన అలసట,నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
beetroot juice
కొన్ని ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. రక్త హీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. బీట్ రూట్ లో ఉండే ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరగటానికి సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ లో చిన్న బెల్లం ముక్క వేసుకొని తాగితే ప్రయోజనం రెట్టింపు అవుతుంది.
Fig Fruit Benefits in telugu
అంజీర్ కూడా రక్తహీనత సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ధర కాస్త ఎక్కువైన దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను అందిస్తుంది. అంజీర్ రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచటమే కాకుండా రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది. ప్రతి రోజు ఒక అంజీర్ ని నీటిలో 5 గంటలు నానబెట్టి తినవచ్చు. నానిన అంజీర్ ని పేస్ట్ గా చేసుకొని పాలల్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.

దానిమ్మ కూడా రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచటానికి చాలా బాగా సహాయపడుతుంది. దానిమ్మ దాదాపుగా అన్నీ కాలాల్లోనూ లభ్యం అవుతుంది. రోజుకి ఒక దానిమ్మ పండు గింజలు లేదా జ్యూస్ తీసుకోవాలి. రక్తహీనత కారణంగా ఒక్కోసారి శారీరక బలహీనత,నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి, వాటిని తగ్గించటానికి కూడా దానిమ్మ సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.