1 గ్లాస్ తాగితే కడుపును శుభ్రం చేయటమే కాకుండా గ్యాస్,కడుపునొప్పిని తగ్గిస్తుంది

Gas Problem Home Remedies : ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు, మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న ప్పుడు, తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ ఉంటారు.
sompu
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం వస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా కడుపు కూడా శుభ్రం అవుతుంది. ఒక గ్లాస్ లో పది పుదీనా ఆకులను, నాలుగు చిన్న అల్లం ముక్కలు, నాలుగు చిన్న నిమ్మకాయ ముక్కలు, అరస్పూన్ సొంపు వేసి నీటిని పోసి నాలుగు గంటలు అలా వదిలేయాలి.

ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా చేయటానికి సమయం లేకపోతే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో పుదీనా, అల్లం ముక్కలు, నిమ్మ ముక్కలు, సొంపు వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి తాగాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది.

గ్యాస్ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన చిట్కా ఫాలో అయ్యి పొట్టకు సంబందించిన అన్నీ రకాల సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.