Healthhealth tips in telugu

ఈ గింజలు బ్రెయిన్ స్ట్రోక్,హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్ రాకుండా కాపాడతాయి

How to avoid brain stroke : మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగితే ఎటువంటి సమస్యలు ఉండవు. రక్తప్రసరణ ఒక్క అవయవానికి అందకపోయిన ఆ అవయవం పనితీరు ఆగిపోతుంది. శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది.
cholesterol reduce foods
ముఖ్యంగా గుండెకు,మెదడుకు రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ అనేవి అవిసె గింజలలో సమృద్దిగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో మంచి పోషకాలను మన శరీరానికి అందిస్తుంది.

రక్తపోటు,కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేసి రక్తంలో ఉన్న బ్లాకేజ్ లను తొలగించి బ్రెయిన్ స్ట్రోక్,హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్ వంటివి రాకుండా కాపాడుతుంది. అవిసె గింజలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. లేదా పేస్ట్ చేసి కూరల్లో వేసుకోవచ్చు. లేదా ఖర్జూరంతో కలిపి లడ్డు వలె చేసుకొని తినవచ్చు.

అవిసె గింజలను దోరగా వేగించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ లో అవిసె గింజల పొడి కలిపి లడ్డూలు చేసుకొని రోజుకి ఒకటి చొప్పున తినాలి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.