7 రోజులు తింటే డయాబెటిస్, నరాల బలహీనత,నరాల మంట,కంటి సమస్యలు తగ్గి జీవితంలో రావు

Brussel Sprouts Benefits In telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి మనలో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు Brussel Sprouts అనేవి మార్కెట్ లో విరివిగానే లభ్యం అవుతున్నాయి. వీటిని ఎక్కువగా వేడి చేయకుండా హాఫ్ బాయిల్ మాత్రమే చేయాలి. ఎక్కువగా వేడి చేస్తే పోషకాలు తగ్గిపోతాయి.
Diabetes In Telugu
వీటిలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన మన శరీరం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా కాపాడుతుంది. Brussel Sprouts అనేవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి మరియు భవిష్యత్ లో డయాబెటిస్ రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరం కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నరాల బలహీనత,నరాల మంటలను తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది అలాగే జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కెరోటినాయిడ్స్‌ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.