సన్ ఫ్లవర్ గింజలు Vs గుమ్మడి గింజలు… ఏది తింటే మంచిది…నమ్మలేని నిజాలు

Sunflower And Pumpkin benefits : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి ఎన్నో పోషక విలువలు ఉన్న గింజలను ఆహారంలో బాగంగా చేసుకుంటున్నారు. వాటిలో సన్ ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసుకుందాం.
Sun Flower seeds Benefits in telugu
సన్ ఫ్లవర్ గింజల విషయానికి వస్తే…ఒక ఔన్స్ గింజలలో 164 కేలరీలు,6 గ్రాముల ప్రోటీన్,2 గ్రాముల ఫైబర్,మెగ్నీషియం, మాంగనీస్ మరియు విటమిన్ ఇ సమృద్దిగా ఉంటాయి. సి-రియాక్టివ్ ప్రోటీన్ అనేది మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ గింజలను మామూలుగా తినవచ్చు. లేదా సలాడ్‌లు, ఓట్స్, స్మూతీస్ లేదా పెరుగులో కలిపి తినవచ్చు.

ఈ గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు, చర్మం మరియు గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ గింజలతో పోలిస్తే గుమ్మడి గింజలలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఒక ఔన్స్ గింజలలో 151 కేలరీలు,7 గ్రాముల ప్రోటీన్, 1.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒమేగా-6 కొవ్వులు రెండింటిలోను దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇక గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మరియు ఫాస్పరస్ విలువ కాస్త ఎక్కువగా ఉంటుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. అలాగే మూత్రాశయంలోని రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మోనోఫాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
రెండు రకాల గింజలలోనూ పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే విషయంలో గుమ్మడి గింజలు కొంచెం మేలైనవి. మీ ఆహారంలో ఈ రెండు గింజలను చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.