Healthhealth tips in telugu

ఈ డ్రింక్ తాగితే మూత్రంలో మంట,యూరిన్ ఇన్ ఫెక్షన్,నొప్పి తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు

Best summer drink elaichi sharbat : వేసవికాలంలో శరీరంలో అధికంగా వేడి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మహిళల్లో యూరిన్ ఇన్ ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ డ్రింక్ తాగటం వలన గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఈ డ్రింక్‌ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి సమృద్దిగా అందుతాయి. అలాగే రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ డ్రింక్ తయారీకి యాలకులను ఉపయోగిస్తున్నాం. ఒక కప్పు యాలకులను రాత్రి సమయంలో రెండు కప్పుల నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
Urine Infection Home Remedies In Telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక యాలకుల మిశ్రమాన్ని వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టాలి. వడకట్టిన యాలకుల నీటిని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి కేజీ పంచదార వేసి సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాలి.
lemon benefits
ఆ తర్వాత పావు కప్పు రోజ్‌ వాటర్‌, పావు స్పూన్ గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి పొయ్యి మీద నుంచి దించి…మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ సిరప్ రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్‌ నీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.