Healthhealth tips in telugu

Bad Smell from mouth:నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి!

Bad Smell From Mouth :Bad Smell from mouth:నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి..
చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు.

నోటి దుర్వాసన సమస్య ఉందంటే నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలన్న ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఉదయం సమయంలో చాలా మంది బ్రష్ చేయకుండానే కాఫీ,టీ తాగేస్తూ ఉంటారు.

అలా అసలు చేయకూడదు. అలా చేస్తే నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. నోటి శుభ్రత లేక‌పోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు. భోజనం చేశాక ఇప్పుడు చెప్పే పదార్ధాలను తీసుకుంటే సరిపోతుంది.

మనలో చాలా మంది భోజనంలో పెరుగు అన్నం తినరు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా పెరుగు అన్నం తినాలి. అలాగే భోజనం చేసిన అరగంట తర్వాత గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు నోటిలో ఉన్న క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసన లేకుండా చేస్తాయి.

విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లను రెగ్యులర్ గా తింటూ ఉంటే నోటి దుర్వాసన రాదు. దంతాలకు సంబందించి సమస్యలు కూడా తొలగి పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.