సోంపుతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది
Beauty benefits-of-fennel seeds : సోంపు గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. సోంపు చర్మ చాయను మెరుగుపరచటానికి,మొటిమలను తగ్గించటానికి, మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో కూడా సోంపును వాడుతున్నారు.
ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో మరియు చర్మ కణాల లైఫ్ ని పెంచటంలో సహాయపడతాయి. సోంపు గింజల్లో రాగి, పొటాషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మొటిమలు, సెల్ డ్యామేజ్, డార్క్ స్పాట్స్ మరియు ముడతలను నివారిస్తాయి.
సోంపును మెత్తని పొడిగా తయారుచేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ సోంపు పొడి,అరస్పూన్ తేనె, అరస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
అరకప్పు నీటిలో ఒక స్పూన్ సోంపు గింజల పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారాక ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగించి దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలను తగ్గించి చర్మంను కాంతివంతంగా మారుస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.