నల్ల పసుపుని ఎప్పుడైనా చూసారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Black Turmeric Benefits In Telugu : మనం సాదరణంగా ప్రతి రోజు పసుపుని వంటల్లో వేస్తూ ఉంటాం. పసుపు వంటలకు రంగు, రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఇప్పుడు నల్ల పసుపు గురించి తెలుసుకుందాం. మీకు నల్ల పసుపు గురించి తెలుసా…దానిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఉబ్బసం, బ్రోన్కైటిస్, న్యుమోనియా మొదలైన ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గించటానికి లేదా చికిత్స చేయడానికి నల్ల పసుపు చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. నల్ల పసుపులోని కర్కుమిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ల్యుకోడెర్మా అనే చర్మ వ్యాధి చికిత్సలో సహాయపడుతుంది.
నల్ల పసుపును ఒక అద్భుతమైన నొప్పి నివారిణిగా చెప్పవచ్చు.
దద్దుర్లు, పంటి నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ నుండి కడుపు సమస్యల వరకు అన్నీ రకాల సమస్యలకు ఉపశమనం కలిగించటానికి సహాయ పడుతుంది. నల్ల పసుపులో ఉండే ఇబుప్రోఫెన్ అనేది కీళ్ల మధ్య ఉండే కీలు మృదులాస్థికి హానిని తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నల్ల పసుపు శరీరంలోని ఆహార కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాలేయ సమస్యలు ఏమి లేకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంలో మాత్రం ఆయుర్వేద వైధ్య నిపుణున్ని తప్పనిసరిగా సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.